కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో.. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. పట్టణంలోని బోయగేరీలో ఉన్న గృహంలో 30 పెట్టెల్లో దాచి ఉంచిన 1,440 టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ రూ. లక్షా 30 వేలు ఉంటుందని.. రాష్ట్రంలో రేట్ల ప్రకారం చూస్తే రూ. 3 లక్షలు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనలో ఓ వ్యక్తిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంతేకుడ్లుర్కు చెందిన ప్రతాప్ రెడ్డి మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.