ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వకల్లులో ఏడుగురు దొంగలు అరెస్ట్.. రూ.5 లక్షలు స్వాధీనం - ఓర్వకల్లులో దొంగతనం

మే 28న కర్నూలు జిల్లా నంద్యాల వద్ద జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఏడు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు.

police arrested seven thiefs at orvakallu
ఓర్వకల్లులో ఏడుగురు దొంగలు అరెస్ట్

By

Published : Jul 1, 2021, 7:56 AM IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏడుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మే 28న రాత్రి తడకనపల్లె వైపు నుంచి నంద్యాల వెళుతున్న ఖాళీ పత్తిలారీని ఆపి.. డ్రైవర్ పాపారాయుడి వద్దనున్న నగదును ఆ దొంగలు ఎత్తుకెళ్లారు. డ్రైవర్​ను ప్లాస్టర్ టేపుతో కట్టేసి అతని వద్ద ఉన్న పత్తిలోడు డబ్బులు రూ. 5,63,900/- సెల్ ఫోన్​ను దోచేశారు.

అక్కడినుంచి స్కార్పియో వాహనంలో పరారయ్యారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. పూడిచెర్లమెట్ట వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఏడుగురికి చెందిన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కర్నూలు డీఎస్పీమహేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details