ఎలాంటి ఆధారం లేకుండానే సీసీ కెమెరా ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. కర్నూలు జిల్లా సూర్యతాండ గ్రామానికి చెందిన రామునాయక్ అనే మేకల కాపరి ఈనెల 4న హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని హత్య చేసి 25 మేకలను తీసుకెళ్లిపోయారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. పోలీసులు ఈకేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి, సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోని టోల్గేట్లో బుల్లి కెమెరాని పరిశీలించగా ఓ వాహనంలోంచి మేక తల బయటికి వచ్చినట్లు గమనించారు. ఈ చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి కొండపాటి కృష్ణకాంత్, పోదొడ్డి చెన్నులను నిందితులగా గుర్తించి, వాటిని హైదారాబాద్‌కు తీసుకెళ్లి 70 వేల రూపాయలకు విక్రయించినట్లు ఎస్పీ ఫక్కీరప్పు తెలిపారు. వీరిద్దరి నుంచి వాహనంతోపాటు, 55 వేలరూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మేక తలకాయ చూశారు... కేసు ఛేదించారు - సీసీ కెమెరా
హత్య కేసులో ఆధారాల్లేవు.. ఆయినా సరే నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు .. ఏలా..? అని ఆశ్చర్యపోతున్నారా..! భయమేలా..సీసీ కెమెరాలున్నాయిగా ... చిన్న ఆధారం..తీగలాగితే డొంక కదిలినట్టు .. బుల్లి కెమెరాలో మేకపిల్ల తల కనిపించడంతో గుట్టురట్టయింది.. కర్నూలు మేకల కాపరి హత్య కేసు ఛేదించి, నిందితుల్ని పట్టించింది.
హత్య కేసును చేధించిన సీసీ కెమెరా