విష ఆహారం తిని 70 గొర్రెలు మృతి కర్నూలు జిల్లా కోయిలకొండ గ్రామంలో విషాహారం తిని 70 గొర్రెలు చనిపోయాయి. మరో 50 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. జొన్న పొలాల్లో మొలకెత్తిన జొన్న ఇగురు, ఆముదం ఆకు, పత్తి కాయలు, ఆకులు తిని... వెంటనే నీరు తాగడం కారణంగా ఆహారం విషతుల్యమై గొర్రెలు చనిపోయాయి. గొర్రెల యజమానికి పది లక్షల వరకు నష్టం జరిగింది. స్పందించిన రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం ఛైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.