తుంగభద్ర పుష్కరాలు ఆఖరి దశకు చేరుకోవటం..కార్తిక పౌర్ణమి కావటం వల్ల కర్నూలు ఘాట్లలో సందడి వాతావరణం నెలకొంది. నదీ స్నానాలు ఆచరించటానికి అభ్యంతరాలు చెప్పకపోవటంతో.. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జిల్లాలోని మంత్రాలయం, సంకల్ బాగ్ పుష్కర ఘాట్లలో రద్దీ పెరిగింది. భక్తితో గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు.
కార్తిక పౌర్ణమితో పుష్కర ఘాట్లలో పెరిగిన రద్దీ
కార్తిక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. తుంగభద్ర పుష్కరాలు ముగుస్తుండటంతో కర్నూలు ఘాట్ల వద్ద రద్దీ పెరిగింది.
పుష్కర ఘాట్ల వద్ద భక్తుల పూజలు