ముఖ్యమంత్రి జగన్ అహంకారపూరిత వైఖరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. రాజ్యాంగం, పరిపాలన అంటే ఏమిటో ముఖ్యమంత్రి నేర్చుకోవాలని సూచించారు. ప్రజలు అధికారాన్నిచ్చింది పగలు, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని హితవు పలికారు. హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సూచనలుగా తీసుకొని మంచి పరిపాలన అందించాలన్నారు. సీఎం జగన్ పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉండాలని వారం, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ అమలు చేయబోతోందని స్పష్టం చేశారు.
జగన్ అహంకారం రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తోంది: శైలజానాథ్ - ప్రభుత్వంపై శైలజానాథ్ విమర్శలు
ముఖ్యమంత్రి జగన్ అహంకారపూరిత వైఖరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉండాలని వారం, పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ అమలు చేయబోతోందని స్పష్టం చేశారు.
జగన్ అహంకారం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తోంది