ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫ్యాక్షన్​ విధానాల వల్ల నష్టపోయేది ప్రజలే.. నేతలు కాదు..!'

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్​ హాజరయ్యారు. పెట్టుబడిదారులను భయపెడితే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయంటూ మండిపడ్డారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్​ నేల కాదని.. చదువుల తల్లి సరస్వతి ఉన్న నేలని జనసేనాని అన్నారు.

pawan kalyan in panyam janasena meeting
పాణ్యం సమావేశంలో పవన్ కళ్యాణ్

By

Published : Feb 7, 2020, 12:27 PM IST

ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న పవన్​

నాయకుల ఫ్యాక్షన్ పోకడల మూలంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. కియా కార్ల కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితి రావటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి దారులను భయపెడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని పవన్​ ప్రశ్నించారు. ఇలాంటి ఫ్యాక్షన్ విధానాల వల్ల నష్టపోయేది ప్రజలే కానీ నేతలు కాదన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ నేల కాదని.. చదువుల తల్లి సరస్వతి ఉన్న నేలని అన్నారు.

ఆనాడు వ్యతిరేకించే వాళ్లం కాదు...

2014లో కర్నూలు ప్రాంతంలో రాజధాని పెడతామని అప్పటి తెలుగుదేశం ప్రకటిస్తే కచ్చితంగా మద్దతు ఇచ్చేవాళ్లమని... విభిన్న భాషలు, సంస్కృతులు కలిగిన కర్ణాటక రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా పాలన కొనసాగుతుంటే... కేవలం తెలుగు మాట్లాడే మన మధ్య ప్రాంతీయ విభేదాలతో సమస్యలు తెస్తున్నారన్నారు. అమరావతిలో రాజధాని పెట్టడం ఇష్టం లేకపోతే జగన్ ఆనాడే వ్యతిరేకించాల్సిందని... ఈ రోజే జ్ఞానోదయం అయినట్లు భావితరాల భవిష్యత్తు కోసం మూడు రాజధానులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్భుతాలనేది భ్రమ

ఒక ప్రాంతంలో నిజంగా రాజధానిని ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరిగిపోతుందా..? అని జనసేనాని ప్రశ్నించారు. కర్నూలు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే నీటి సమస్య తీరుతుందా..?. వలసలు తగ్గిపోతాయా..? అని నిలదీశారు. రాజధాని వస్తే అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలను నాయకులు సృష్టిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు

ABOUT THE AUTHOR

...view details