చిన్న వంతెనలే నిర్మించలేని వైకాపా సర్కారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులో రెండో రోజు పర్యటించిన ఆయన.. జోహరాపురం వంతెనను పరిశీలించారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం సగంలో ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పవన్‌కు తెలిపారు. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఈ మార్గంలో వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పవన్ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా.. గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజాధనం వృథా అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ గృహాలు పరిశీలన
జోహరాపురం నుంచి నన్నూరు వెళ్లిన పవన్... అక్కడ ఉన్న ఎన్టీఆర్ గృహాలను సందర్శించారు. గృహాలు లబ్ధిదారులకు ఎందుకివ్వలేదని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ గృహాలను లబ్ధిదారులకు అందచేసి.. తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
చేనేత కార్మికులతో సమావేశం