ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ పాఠశాలలను కొనసాగించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాం' - కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన న్యూస్

తమ పిల్లలు చదువుకుంటున్న బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను కొనసాగించాలని కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పేదవారికి అనువుగా ఉన్న ఈ పాఠశాలలను మూసివేస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.

Parents of students in front of the Kurnool Collector's Office are concerned that the Best Available Schools should continue
'పాఠశాలలను ప్రారంభించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం'

By

Published : Feb 11, 2021, 6:57 PM IST

బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను కొనసాగించాలని కర్నూల్​ కలెక్టర్ కార్యాలయం ముందు రిపబిక్లన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తమ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని సీఎం జగన్​ను కోరారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద విద్యార్థుల కోసం ఈ స్కూళ్లను ప్రారంబించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మరినా.. ముఖ్యమంత్రులు మారినా.. ఈ పాఠశాలలను కొనసాగించారని గుర్తు చేశారు. పేదవారికి అనువుగా ఉన్న ఈ పాఠశాలలను కొనసాగించకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details