కర్నూలు జిల్లాలో కరోనా మరొకరిని బలి తీసుకుంది. కర్నూలు నగరంలోని బుధవారపేట ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ సోకి విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. తాజాగా.. ఆరోగ్యం విషమించి కర్నూలు జీజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తంగా జిల్లాలో కరోనా కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. మరోవైపు...జిల్లాలో మొత్తం 129 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కర్నూలులో కరోనాకి మరొకరు బలి - కర్నూలులో కరోనా మరణాలు
కర్నూలులో కరోనా కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది బలవుతుండగా.. ఓ వృద్ధుడు కన్నుమూశాడు.
old man dies due to corona in kurnool