ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదోని ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డ్'

విలువలతో కూడిన మెరుగైన విద్య, బోధన ఉత్తమ ఫలితాలతో... కర్నూలు జిల్లా ఆదోని నెహ్రు స్మారక పురపాలక ఉన్నత పాఠశాలకు భారీగా డిమాండ్ పెరిగింది .పాఠశాలల ప్రారంభమైన కొన్ని రోజులకే... సీట్లు అయిపోటంతో.... ప్రవేశాలు లేవని బోర్డు పెట్టేశారు.

'ఆదోని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డ్'

By

Published : Jul 3, 2019, 6:23 AM IST

కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ స్మారక పురపాలక ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు దర్శనమిస్తోంది. 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమల్లో బోధిస్తున్నారు . విలువలతో కూడిన మెరుగైన విద్య, బోధన ఉత్తమ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాయి. ఈ కారణంగా పాఠశాలకు భారీగా డిమాండ్ పెరిగింది. పాఠశాల ప్రారంభమైన కొన్ని రోజులకే సీట్లు అయిపోవటంతో.... ప్రవేశాలు లేవని బోర్డు పెట్టేశారు.

అదనపు గదులు కావాలి...

పాఠశాలలో ప్రస్తుతం 15వందల 56 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 470 మంది ఈ ఏడాది కొత్తగా చేరటం గమనార్హం. గత ఏడాది 22 మంది విద్యార్థులు 9 పాయింట్లను సాధించారని ప్రధానోపాధ్యాయుడు రామయ్య తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో చేరికలను దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

'ఆదోని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డ్'

ఇవీ చూడండి-ప్రభుత్వానికి నేనే సమస్యగా మారానేమో!?: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details