కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ఉన్నతాధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొబైల్ రైతు బజారు ద్వారా కూరగాయలు విక్రయించే రైతులకు... 'మాస్కు ఉంటే మాట్లాడతా' అనే వాక్యాన్ని ముద్రించిన మాస్కులను పంపిణీ చేశారు. రైతుల వద్దకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు గమనించి అవగాహన పెంచుకుంటారనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక పొదుపు మహిళలతో 11 లక్షల మాస్కులను కుట్టిస్తున్నట్లు డీఆర్డీఏ, మెప్మా పీడీలు శ్రీనివాసులు, తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు.
మాస్కు ఉంటేనే మాట్లాడతా! - కర్నూలు తాజా కొవిడ్ సమాచారం
'మాస్కు ఉంటే మాట్లాడతా' అనే వాక్యం ముద్రించి ఉన్న మాస్కులను రైతులకు అధికారులు పంపిణీ చేశారు. రైతు బజార్ల వద్దకు వచ్చే వినియోగదారులు అవగాహన పెంచుకుంటారనే ఉద్దేశంతో ఈ చర్య అమలు చేస్తున్నట్టు విషయాన్ని మార్కెటింగ్ శాఖ ఏడీ తెలిపారు.
మార్కెటింగ్ శాఖ తయారు చేయించిన మాస్కు