నంద్యాలలో దాతలు, ప్రభుత్వ సహకారంతో ఆధునీకరించిన హిందూ శ్మశాన వాటికను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నాలుగేళ్ల క్రితం ఈ శ్మశానవాటిక అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్వర్గధామం పేరిట అభివృద్ధి చేసిన ఈ శ్మశాన వాటికలో ప్రత్యేక వసతులు కల్పించారు. అభివృద్ధి చేసిన నవ నిర్మాణ సమితి సభ్యులను ఎంపీ, ఎమ్మెల్యే అభినందించారు. అసంపూర్తిగా కొన్ని పనులు మిగిలిపోయాయని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి రెండు లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు.
నంద్యాలలో హిందూ శ్మశాన వాటిక ప్రారంభం - నంద్యాలలో హిందూ శ్మశాన వాటిక ప్రారంభం
నంద్యాలలో దాతలు, ప్రభుత్వ సహకారంతో ఆధునీకరించిన హిందూ శ్మశాన వాటికను ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ప్రారంభించారు.
innagurated cremation ground at nandyal city