ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 5, 2020, 1:02 PM IST

ETV Bharat / state

నందికొట్కూరులో సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే ఆర్థర్

నందికొట్కూరు శాసనసభ్యుడు ఆర్థర్.. పట్టణంలో పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు.

Nandikotkur MLA tour of municipal wards
నందికొట్కూరు ఎమ్మెల్యే పురపాలక వార్డుల్లో పర్యటన

నందికొట్కూరు ఎమ్మెల్యే పురపాలక వార్డుల్లో పర్యటన

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. పట్టణంలోని వార్డుల్లో పర్యటించారు. రెండు నుంచి ఐదో వార్డు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని కాలనీల్లో రహదారులు లేవని, మంచినీటి సమస్య ఉందని, మురుగు కాలువల సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే... రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చాయని.. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మంచినీటి సమస్య తీర్చేందుకు అలగనూరు జలాశయం నుంచి నందికొట్కూరు పురపాలక 103 కోట్ల వ్యయంతో త్వరలోనే పనులు జరుగుతాయని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details