ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం కోసం మృతదేహాలతో ఆందోళన

కర్నూలు జిల్లా దుపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలం తగాదాల్లో ఇద్దరు మృతి చెందారు. న్యాయం చేయాలని బంధువులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు.

By

Published : Mar 25, 2019, 7:18 PM IST

మృతదేహలతో నిరసన

మృతదేహలతో నిరసన
కర్నూలు జిల్లాదుపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలం తగాదాలోఅత్త, అల్లుడు మృతి చెందారు. నాగన్న అనే వ్యక్తికిఐదు ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. ఈ పొలాన్ని రాజేష్ పటేల్ వద్ద ఐదు లక్షల రూపాయలకు తాకట్టు పెట్టాడు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో రాజేష్ పటేల్ ఆ పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్​చేసుకున్నాడు. ఎకరా40 సెంట్లు పొలం రాజేష్ పటేల్ అక్రమంగా తీసుకున్నట్లు గ్రామస్తులు, బంధువులు తెలిపారు. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. తాజాగా జరిగినఘర్షణలో నాగన్న కింద పడి మృతి చెందాడు. అల్లుడు మరణించడంతోఅత్త ఎల్లమ్మ గుండెపోటుతో మరణించింది. వీరిద్దరి మృతికిపటేలే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆయన ఇంటిముందు మృతదేహాలతో ఆందోళనకు దిగారు.న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details