ఓ ఎంపీ, ఇద్దరు శాసనసభ్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు... వెలుగోడు జలాశయం నుంచి నీటిని విడుదల చేపట్టారు. ఈ సమయంలో పంపుల వద్ద పూజలు నిర్వహించి నీటిని చెరువులోకి విడుదల చేస్తుండగా ఒక్కసారిగా... నీరు పెద్ద ఎత్తున పైకి ఎగజిమ్మింది. ఈ ఘటనలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్లు పూర్తిగా నీటితో తడిసిపోయారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని బయటకు తీసుకురావటంతో...అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ ఎంపీ, ఎమ్మెల్యేలు - nandyal mp bramhananda reddy
కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ, ఇద్దరు శాసనసభ్యులకు ప్రమాదం తప్పింది. జిల్లాలోని సిద్దాపురం చెరువుకు వెలుగోడు జలాశయం నుంచి నీటిని విడుదల చేయగా...ఆ సమయంలో నీరు పెద్ద ఎత్తున ఎగజిమ్మింది. సెక్యూరిటీ సిబ్బంది వారిని కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు