చంద్రబాబు, లోకేష్ అంటే ప్రధానికి భయం! - కేఈ కృష్ణమూర్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను చూస్తుంటే ప్రధాని మోదీకి భయమేస్తోందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.
కేఈ కృష్ణమూర్తి
By
Published : Feb 11, 2019, 5:53 PM IST
కేఈ కృష్ణమూర్తి
దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కర్నూలులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దీక్షకు దిగారు. కేంద్రం సహకరించకున్నా... ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ లను చూస్తుంటే ప్రధాని మోదీకి భయమేస్తోందన్నారు. అందుకే గుంటూరులో జరిగిన సభలో వారి గురించి ప్రస్తావించారని విమర్శించారు.