కర్నూలు జిల్లా నియోజకవర్గ కేంద్రం పత్తికొండలో అధ్వాన్నంగా ఉన్న రహదారులను ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వెనుక ఉన్న వీధిలో ఆయా శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఎంతోకాలంగా వీధిలో రోడ్డు వల్ల సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రహదారులను బాగుచేసి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని .. ఆ ప్రాంత ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు.
పత్తికొండలోని రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే - పత్తికొండ రహదారులు తాజా వార్తలు
కర్నూలు జిల్లా పత్తికొండలోని పాడైన రహదారులను ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. ఇబ్బందులున్నాయని అధికారులకు తెలిపినా వారెవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు.

'పత్తికొండలోని రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే'