ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

three capitals: మళ్లీ మార్చిలో మూడు రాజధానుల బిల్లు: మంత్రి బాలినేని - 3 capital bill

minister balineni on three capitals: మూడు రాజధానుల బిల్లును మళ్లీ మార్చిలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్న అనంతరం ఈ విషయాన్ని తెలిపారు.

minister-balineni-srinivasa-reddy-comments-on-three-capitals
మళ్లీ మార్చిలో మూడు రాజధానుల బిల్లు

By

Published : Dec 3, 2021, 6:59 AM IST

minister balineni on three capitals: మూడు రాజధానుల బిల్లును రానున్న మార్చిలో ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టనుందని రాష్ట్ర విద్యుత్తు, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కుటుంబసమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చారు. జగన్‌మోహన్‌ రెడ్డి మరో 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని స్వామిని ప్రార్థించానని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయాల నుంచి విరమించుకోవాలని, ఆయన పార్టీ నిలవాలంటే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు రావాలని సూచించారు.

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం

ap govt withdrew three cpaitals act: మూడు రాజధానుల చట్టాన్ని ఈ మధ్యనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబధించిన మూడు రాజధానుల చట్టం రద్దు బిల్లును కేబినెట్​లో ఆమోదించారు. ఇదే విషయాన్ని ఈ ఆంశంపై విచారణ జరుగుతున్న హైకోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలియచేశారు.

మెరుగైన బిల్లు తెస్తాం..

jagan on three capitals: వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని సీఎం జగన్ శాసనసభలో వెల్లడించారు. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన సీఎం.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.

అమరావతి రాజధాని కోసం..

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు, మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మహాపాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అన్నదాతలకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే.. పాదయాత్రకు వచ్చే ప్రచార రథాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. గమ్యం చేరుకుని ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని అమరావతి రైతుల ఐకాస స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

chandrababu naidu: 'పారదర్శకంగా ఎన్నికలు జరిగితే..తెదేపాకే విజయం దక్కేది'

ABOUT THE AUTHOR

...view details