ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Avanthi: సీమ జిల్లాల్లో పర్యటక రంగ అభివృద్ధికి చర్యలు: మంత్రి అవంతి - heli tourism in andhra pradesh news

రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి క్రమేపీ పెరుగుతోందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యటకులను ఆకట్టుకునేందుకు.. ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

Minister Avanthi
Minister Avanthi

By

Published : Oct 9, 2021, 7:13 PM IST

Updated : Oct 9, 2021, 7:24 PM IST

రాయలసీమ జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్థి చేయటానికి చర్యలు చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు(Minister Avanthi news). తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిటూరిజాన్ని(heli tourism in andhra pradesh news) వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కరోనాతో పర్యాటక శాఖ నష్టాల్లో కూరుకుపోయిందని.. 130 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం.. 60 కోట్ల రూపాయలకు పడిపోయిందన్నారు.

పర్యటక శాఖ సిబ్బంది కృషితో కష్ట సమయంలో కూడా ఆదాయాన్ని పొందగలిగామన్నారు మంత్రి అవంతి. పర్యటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి క్రమేపీ పెరుగుతోందని.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పర్యాటకులనే కాకుండా కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటలకును ప్రత్యేక ప్యాకేజీలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో త్వరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టార్ హోటల్​ను నిర్మిస్తామన్నారు. నూతనంగా మరో 26 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంను పర్యాటక శాఖకు తితిదే అప్పగించనుందని చెప్పారు.

Last Updated : Oct 9, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details