అమరావతి ఉద్యమం ప్రజల నుంచి రాలేదని.. కృత్రిమంగా సృష్టించిందేనని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆర్థికంగా స్థితిమంతులని అవంతి అభిప్రాయపడ్డారు. విశాఖ రాజధానిపై 21 మంది తెదేపా సభ్యులు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో తెదేపా గెలిస్తే చంద్రబాబు వాదన ఒప్పుకుంటామని చెప్పారు. అమరావతిపై ప్రేమ ఉంటే పవన్ గాజువాక నుంచి ఎందుకు పోటీచేశారని ప్రశ్నించారు.
ఆ జిల్లాల వాళ్లు స్థితిమంతులు: అవంతి - రాజధానిపై మంత్రి అవంతి వ్యాఖ్యలు న్యూస్
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ విధానమని.. మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వైకాపా ఎమ్మెల్యేలు అందరూ అండగా నిలిచారని చెప్పారు.
minister avanthi srinivas about amaravathi capital