కర్నూలు జిల్లా ఆదోనిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు రూ.15కే భోజనం అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రభుత్వం అన్నదాతలకు తక్కువ ధరకు ఆహారం అందిస్తోంది. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మంచి భోజనం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు రూ.15కే భోజనం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
ఆదోనిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు రూ.15కే భోజనం అందించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. అందుకు ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది.
రైతులకు తక్కువ ధరకే భోజనం