కర్నూలు జిల్లా కోడుమూరులోని సుందరయ్యనగర్‌లో అప్పుల బాధ తాళలేక ఖాదర్ బేగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఆకుకూరలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ఫక్కూరుబేగం కూలీ పని చేస్తోంది. కాగా .. కొన్నేళ్ల క్రితం వీరు ఇల్లు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో రూ.3 లక్షలు అప్పు చేశారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
కన్నీరుమున్నీరైన కుటుంబం...