కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల నల్లమల అటవీ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శివపురం గ్రామానికి చెందిన గంగన్న అనే వ్యక్తిని.. అతని భార్య ఇతరులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. గంగన్న చిన్న గుమ్మడపురం గ్రామానికి చెందిన దుర్గమ్మతో గత పది సంవత్సరాల కిందట వివాహమైంది. మృతుడు లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తూ ఉండేవాడు.
దుర్గమ్మ పుట్టింట్లో ఉంది. గంగన్న శివపురానికి రావాల్సిందిగా పదేపదే భార్యను పిలిచేవాడు. ఈ విషయమై భార్యాభర్తల ఇరువురికి, భార్య బంధువులతో గొడవలు జరిగేవి. గత రెండు రోజుల కిందట శివపురానికి రావాల్సిందిగా మళ్లీ భార్యను పిలిచాడు. ఈ విషయమై మళ్ళీ వారి మధ్య గొడవ తలెత్తింది. ఆమె కాపురానికి వెళ్లలేదు. భర్త పై కక్ష పెంచుకున్న దుర్గమ్మ.. మరి కొంతమందితో కలిసి రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి దారుణంగా చంపించినట్లు పోలీసులు తెలిపారు.