ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో ముగిసిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - శ్రీశైలం తాజా సమాచారం

శ్రీశైల మహాక్షేత్రంలో 7 రోజుల పాటు వేడుకగా జరిగిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆదిదంపతులైన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా శయనోత్సవం జరిపి ఉత్సవాలకు ముగింపు పలికారు.

Makara Sankranti Brahmotsavalu
శ్రీశైలంలో ముగిసిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

By

Published : Jan 18, 2021, 1:34 PM IST

శ్రీశైలంలో ముగిసిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో 7 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో సాగిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, పండితులు విశేష పూజలు చేశారు.

మంగళ వాయిద్యాల నడుమ అశ్వ వాహనాధీశుడైన పార్వతి సమేత మల్లన్నకు ఆలయ ప్రాంగణంలో ఆలయ ఉత్సవం నిర్వహించారు. 18 రకాల పుష్పాలు , తొమ్మిది రకాల ఫలాలను స్వామివార్లకు అర్పించి పూష్పోత్సవ సేవను వైభవంగా జరిపారు. ఆదిదంపతులైన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా శయనోత్సవం జరిపి ఉత్సవాలకు ముగింపు పలికారు.

ABOUT THE AUTHOR

...view details