కరోనా ప్రభావం... మహానంది ఆలయం మూసివేత - mahanandi temple news
కరోనా వైరస్ ప్రభావం కారణంగా... కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 31 వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదని ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా వైరస్ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఈనెల 31 వరకు మూసివేత కొనసాగనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. స్వామి వారికి చేసే సేవలు ఏకాంతంగా జరుగనున్నాయి.