కర్నూలు జిల్లా (kurnool district) సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ మద్యాన్ని సెబ్ సిబ్బంది (liquor seized at Panchalingala check post)పట్టుకున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ నిమిత్తం సిబ్బంది ఆపగా.. కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం కారును తనిఖీ చేసిన సిబ్బంది.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 384 మద్యం సీసాలను గుర్తించారు. కారును సీజ్ చేసి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Liquor seize: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద మద్యం పట్టివేత - కర్నూలు జిల్లా తాజా సమాచారం
కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్ అధికారులు.. తెలంగాణ మద్యాన్ని స్వాధీనం(liquor seized at Panchalingala check post) చేసుకున్నారు. మద్యం సరఫరాకు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.
liquor seized