RCM Primary School: అది 15 అడుగుల వెడల్పు.. 30 అడుగుల పొడవున్న తరగతి గది. అందులోనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం బస్తాలు, వంట సామగ్రి, నీటి ట్యాంకు, పుస్తకాలు, క్రీడా సామగ్రి ఉంటాయి. వీటన్నింటికీ పోగా మిగిలిన ఆ కాస్త స్థలంలో ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. పైగా అన్ని తరగతులకు ఉన్నది ఒకే ఉపాధ్యాయుడు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు మండలం హుళేబీడు గ్రామంలోని ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాలలో బోధనావస్థ. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 114 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో రోజూ 90 నుంచి 100శాతం మంది హాజరవుతారు. వీరందరిని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సి వస్తోంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.
RCM Primary School: మధ్యాహ్న భోజన సామాగ్రి మధ్యే.. విద్యార్థులకు పాఠాలు - కర్నూలు జిల్లా తాజా వార్తలు
RCM Primary School: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన బడి నాడు - నేడు కార్యక్రమం కొన్ని గ్రామాల్లో కనుమరుగవుతోంది. పాఠాలు చెప్పాల్సిన తరగతి గదిలో ఒకపక్క మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం బస్తాలు, వంట సామగ్రి ఉంటే మరోపక్క ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది.
ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాల