కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అటవి పరిధిలో మూడేళ్ల చిరుత పులి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న అటవి శాఖ అధికారులు కాలువ వద్ద పడిఉన్న చిరుతలో వేటాడే శక్తి హరించి ఆకలితో బలహీన పడి కాలువలో పడి మృతి చెందినట్లు కనిపిస్తోందని డీఎఫ్ఓ చెప్పారు.మృతికి గల కారణాలు శవపరీక్షలో తెలుస్తాయని ఆయన వెల్లడించారు.చిరుత మృతుల్లో ఏదైనా కుట్ర దాగి ఉంటే,అందుకు కారకులైన వారిని గుర్తించి పట్టుకుంటామని తెలిపారు.
ఆళ్లగడ్డ కాలువలో చిరుత మృతదేహం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ కాలువలో చిరుత పులి పడి మరణించింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుత మృతిపై కారణాలను అన్వేషిస్తున్నారు.
ఆళ్లగడ్డ ప్రాంతం కాలువలో పడి చిరుత మృతి..