కర్నూలులోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తికమాసం నాలుగవ సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ పుష్కరిణి వద్దకు చేర్చారు. ఆలయం వద్ద లక్ష దీపాలను ఏర్పాటు చేశారు. ఉత్సవ వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి... అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు దశ విధ హారతులను సమర్పించారు. పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొన్నారు.
దేదీప్యమానంగా శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి
కార్తికమాసం నాల్గవ సోమవారం కర్నూలు జిల్లాలోని శ్రీశైల ఆలయంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ పుష్కరిణి వద్దకు చేర్చి దశ విధ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేదీప్యమానంగా శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి