జులై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని లలిత ఆరోపించారు.రాష్ట్ర బడ్జెట్లోనూ కార్మికుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తుంటే మధ్యలోనే పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి... కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
"బడ్జెట్లో కార్మికులపై చిన్నచూపు సరికాదు" - కర్నూలు జిల్లా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కార్మికులకు మొండిచేయి చూపాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
ధర్నాచేస్తున్న కార్మికులు