ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జాహ్నవి అంత్యక్రియలు పూర్తి.. శోకసంద్రంగా కౌతాళం - road accident in America

JAHNAVI FUNERALS అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలుకు చెందిన యువతి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జాహ్నవి మృతదేహాన్ని శంషాబాద్‌ విమానాశ్రం నుంచి కౌతాళం మండలం కుంబళనూరు క్యాంపునకు ఆదివారం రాత్రి తీసుకొచ్చారు.

jahnavi funerals
jahnavi funerals

By

Published : Jan 30, 2023, 9:27 AM IST

JAHNAVI FUNERALS : అమెరికాలోని సియాటెల్‌ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన యువతి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి మృతదేహాన్ని శంషాబాద్‌ విమానాశ్రం నుంచి కౌతాళం మండలం కుంబళనూరు క్యాంపునకు ఆదివారం రాత్రి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి అందరూ విలపించారు. జాహ్నవి తన కుటుంబసభ్యులతో కలిసి ఆదోని పట్టణంలో నివాసముంటున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఆమె అమెరికా వెళ్లారు.

ఈనెల 23న అమెరికాలో జరిగిన రహదారి ప్రమాదంలో చనిపోయారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కందుల శ్రీకాంత్‌, విజయలక్ష్మి, తాతయ్య సూరిబాబు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమార్తె మృతదేహాన్ని ఇండియాకు పంపాలని తానా అసోసియేషన్‌ సభ్యులు, స్నేహితులు, బంధువులను తండ్రి శ్రీకాంత్‌ వేడుకున్నారు. ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి జాహ్నవి మృతదేహం చేరుకుంది.

కుంబళనూరు క్యాంపునకు రాత్రి 9.20 నిమిషాలకు తరలించారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విలపించారు. రాత్రి 10.30 గంటలకు దహన సంస్కారాలు చేశారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బుద్ధారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే పీఏ వెంకటరామిరెడ్డి తదితరులు నివాళులర్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details