రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను అమలు చేసేది లేదని అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పడంపై కర్నూలులో వైకాపా నాయకులు, ముస్లిం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారని పలువురు నేతలు కొనియాడారు. నగరంలోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన కర్నూలు ముస్లింలు - kurnool town muslims latest news
ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను అమలు చేయమని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పడంపై కర్నూలు వైకాపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న వైకాపా నాయకులు