కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కొండల్లో, గుట్టల్లో ఇచ్చే ఇళ్ల పట్టాలు వద్దని లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో ఇంటి స్థలాల కోసం 52 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో లక్కీడిప్ రసీదులను ఇచ్చే సమయంలో కొండలు, గుట్టలు పక్కన ఇచ్చే ఇంటి స్థలాలు మాకు అవసరం లేదని లబ్ధిదారులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామం పక్కనే భూమి కొనుగోలు చేసి అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.
కొండల్లో, గుట్టల్లో స్థలాలు వద్దంటూ లబ్ధిదారుల ఆందోళన
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళన చేశారు. కొండల్లో, గుట్టల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలు వద్దంటూ నిరసన తెలిపారు. గ్రామం పక్కన ఉండే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
kurnool dst adoni madnal eligible canidates protest about housing lands