ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 19, 2020, 1:57 PM IST

ETV Bharat / state

ఔదార్యం.. గూడు లేని వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చిన ఎస్సై

పోలీసులంటే కర్కశంగా ఉంటారనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే కఠినంగా ఉండే ఖాకీల్లోనూ కరిగిపోయే మనసు ఉంటుందని నిరూపిస్తున్నారు కొందరు. ఆ కోవలోకే చెందుతారు కర్నూలు జిల్లా పెద్దపుదేళ ఎస్సై. గూడు లేని అవ్వకు నీడనిచ్చి మంచి మనసు చాటుకున్నారు ఆయన. ఆసుపత్రి ఆవరణలో కాలం గడుపుతున్న ఆ వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చి ఔదార్యం చూపారు.

si gave house to old woman
గూడు లేని వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చిన ఎస్సై

గూడు లేని వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చిన ఎస్సై

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపుదేళలో ఉంటున్న లక్ష్మమ్మకు నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలయ్యాయి. అయితే ఒక కుమార్తె భర్త మరణించాడు. అప్పటినుంచి ఆ కుమార్తె, మనవరాళ్లతో కలిసి స్థానిక పశువుల ఆసుపత్రి ఆవరణలో ఉంటోంది లక్ష్మమ్మ.

గూడు లేని వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చిన ఎస్సై

ఆ వృద్ధురాలి పరిస్థితి గురించి తెలుసుకున్న ఎస్సై మారుతి శంకర్ చలించిపోయారు. తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు. ఊరిలో తన సొంత డబ్బు రూ. 50 వేలతో ఒక సెంటు స్థలాన్ని కొని.. రూ. 80వేలతో ఇల్లు కట్టించారు. బుధవారం గృహప్రవేశం చేసి వృద్ధురాలికి ఇల్లు అప్పగించారు.

గతంలోనూ ఎస్సై మారుతి శంకర్ చాలామందికి సహాయం చేశారు. పోలీస్ ఉద్యోగార్ధులకు సొంత ఖర్చుతో రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షలకు శిక్షణ ఇప్పించారు.

ఇవీ చదవండి..

ప్రపంచ స్మార్ట్‌సిటీ అవార్డుల పోటీలో.. తుది జాబితాలో విశాఖకు చోటు

ABOUT THE AUTHOR

...view details