వసతి గృహాల్లోని భోజనం, తాగునీటి వసతిని జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ పరిశీలించారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ వసతి గృహంలో రాత్రి మెనూలో చికెన్ కర్రీ ఉండగా... విద్యార్థులకు పెట్టకపోవడంపై జేసీ ఆగ్రహం వక్తం చేశారు. ఎస్సీ వసతి గృహంలో భోజనం అయ్యాక అరటిపండు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అందజేయాలని ఆదేశించారు. అనంతరం డోన్‌లో వసతి గృహం 2 ను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు జేసీకు వినతిపత్రం అందజేశారు.
వసతిగృహంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - సయ్యద్ ఖాజా మోహిద్దీన్
కర్నులు జిల్లా డోన్‌లో ఎస్సీ, బీసీ వసతిగృహంలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహిద్దీన్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకున్నారు.
అధికారులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్