కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గటం లేదు. బుధవారం కొత్తగా 697 మంది కొవిడ్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 46 వేల 255 మందికి కరోనా సోకిందనీ.. వారిలో 38 వేల 975 మంది కరోనాను జయించి.. డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 6 వేల 897 మంది చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం ఒక్క కరోనా మరణం లేదనీ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 383 మంది కొవిడ్‌కు బలయ్యారని వివరించారు.
కర్నూలులో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 697 కేసులు - కర్నూలు జిల్లా కరోనా కేసుల అప్డేట్
కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 697 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. రోజురోజుకి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైరస్ బారిన పడతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కర్నూలులో తగ్గని కరోనా ఉద్ధృతి