ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్ వీరపాండ్యన్ - kurnool collector inspection at public offices news in telugu

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఉద్యోగులను హెచ్చరించారు. జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో మద్దికేర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక వైద్యశాల, గ్రామ సచివాలయ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-December-2019/5354843_359_5354843_1576164594566.png
kurnool collector sudden inspection at public offices in maddikera

By

Published : Dec 12, 2019, 9:43 PM IST

Updated : Dec 13, 2019, 7:41 AM IST

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్ వీరపాండ్యన్

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్​ వీరపాండ్యన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక వైద్యశాల, గ్రామ సచివాలయ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పాఠ్యాంశాల బోధనపై విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి... విద్యార్థుల పరిస్థితిని వారికి తెలియజేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రాథమిక వైద్యశాల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయం కార్యాలయం సందర్శించిన కలెక్టర్ భవనానికి రంగులు వేయకపోవటంతో పాటు కౌంటర్లు ఏర్పాటు చేయనందున సంబంధిత అధికారులపై ఆగ్రహించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Dec 13, 2019, 7:41 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details