లబ్ధిదారుల ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానానికి చేరిన వాహనాలను కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పరిశీలించారు. జిల్లాకు 760 వాహనాలను కేటాయించగా.. అందులో టాటా వాహనాలు 526, మారుతి వాహనాలు 234 ఉన్నట్లు సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వాహనాల్లోని రేషన్ సరుకులను తూకం వేసే పరికరాలు, ఇతర భాగాలను పరిశీలించారు. స్వయంగా వాహనాన్ని నడిపి.. పని తీరును తెలుసుకున్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈనెల 20న వాహనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేయాలని సివిల్ సప్లైయిస్ డివిజనల్ మేనేజర్ షర్మిళను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఈయనతో పాటు జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.
రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించిన కర్నూలు కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం సిద్ధం చేసిన వాహనాలు కర్నూలు నగరానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వీటిని పరిశీలించారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈనెల 20న వాహనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేయాలని సివిల్ సప్లైయిస్ డివిజనల్ మేనేజర్‌ను ఆదేశించారు.
రేషన్ బియ్యం పంపిణీ కోసం సిద్ధం చేసిన వాహనాలను పరిశీలించిన కలెక్టర్