కరోనా వైరస్ను అరికట్టేందుకు కర్నూలు నగరంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. దిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిని గుర్తించామని చెప్పారు. వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించినట్టు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి సమాచారం రావడం వల్ల ఆ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశామన్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు కర్నూలులో కఠిన చర్యలు
దిల్లీ నుంచి నగరానికి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్లకు తరలించామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు అన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
కర్నూలులో కఠిన చర్యలు