రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. మద్దూరు - తొగిర్చేడు గ్రామాల వద్ద ఉన్న వంతెనపై నుంచి కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. అనుపూరు గ్రామం వద్ద కుందూ వరదతో పొలాలు నీటమునిగాయి.
భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న కుందూ - కుందూ నది వరద
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి మండలంలోని కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వర్షాల ధాటికి ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న కుందూ