ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన కృష్ణా బోర్డు సభ్యుడు - శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన కృష్ణా బోర్డు సభ్యుడు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు ఎల్​.కె. ముంతాంగ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్ట కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. జలాశయ నీటి నిల్వ, టెలిమెట్రీ పనితీరుపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్​కో ఇంజినీర్లతో సమావేశమయ్యారు.

Krishna board member
Krishna board member

By

Published : Dec 15, 2020, 7:08 PM IST

Updated : Dec 15, 2020, 7:52 PM IST

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన కృష్ణా బోర్డు సభ్యుడు

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్ట కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని కృష్ణా బోర్డు సభ్యుడు ఎల్.కె. ముంతాంగ్ సందర్శించారు. జలాశయ నీటి నిల్వ వివరాలు, టెలిమెట్రీ పనితీరును పరిశీలించారు. అనంతరం జెన్​కో ఇంజినీర్లతో సమావేశం అయ్యారు. జల విద్యుత్ కేంద్రం పని తీరు, నిర్వహణ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జల విద్యుత్ కేంద్రంలోని యూనిట్లను పరిశీలించారు.

కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం వివరాలను చీఫ్ ఇంజినీర్ నరసింహారావు కృష్ణా బోర్డు సభ్యుడు ముంతాంగ్​కు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆనకట్టల నిర్మాణంపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ కృష్ణా బోర్డు సభ్యుడు ఎల్.కె. ముంతాంగ్, ఈఈ శివ శంకర్ పర్యటించడం విశేషం.

ఇదీ చదవండి :ఈ పిల్లలతో పెట్టుకుంటే పంచ్​ పడుద్ది..!

Last Updated : Dec 15, 2020, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details