ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్​కు రేపు 'కోట్ల' రాజీనామా - తెదేపాలో కోట్ల

కాంగ్రెస్ పార్టీకి రేపు రాజీనామా చేయనున్నట్లు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 28న సీఎం సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

By

Published : Feb 21, 2019, 9:43 PM IST

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రేపు రాజీనామా చేయనున్నట్లు కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి తెలిపారు. ఈ నెల 28న కర్నూలు కోడుమూరులో జరిగే బహిరంగ సభలో... సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఒకే కుటుంబం నుంచి 3 సీట్లు కోరడం భావ్యం కాదన్నారు.

ముఖ్యమంత్రికిధన్యవాదాలు

ఈ నెల 28న కర్నూలులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు...వేదవతి, గుండ్రేవుల, ఎల్​ఎల్​సీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని కోట్ల తెలిపారు. కర్నూలు రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అందుకు రైతుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలుపారు. సీట్ల విషయంపై ఇంతవరకూ సీఎం మాట్లాడలేదని కోట్ల స్పష్టం చేశారు.

కేఈ పై

కేఈ కృష్ణమూర్తి కుటుంబంతో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కోట్ల..గతంలో కేఈ కుటుంబంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details