తెదేపా గూటికి 'కోట్ల'! - tdp
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారలేదని... రైతుల బాగు కోసమే తెదేపాలోకి వచ్చామని చెప్పారు. వైకాపా, భాజపాతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారిని ఓడించాలని పిలుపునిచ్చారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
స్వప్రయోజనాల కోసం పార్టీ మారలేదని... రైతుల బాగు కోసమే పార్టీ మారినట్లు కోట్ల కుటుంబం తెలిపింది. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనిసూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.వైకాపా, భాజపా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ తెదేపాకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో మంత్రులుమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, ఫరూఖ్, అఖిలప్రియ పాల్గొన్నారు.