ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు - ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

కర్నూలు తెదేపా పార్లమెంట్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కుమారుడు, కుమార్తెలు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు.

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు

By

Published : Apr 11, 2019, 4:41 PM IST

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్య ప్రకాశ్ రెడ్డి సోదరుడు హరిచక్రపాణిరెడ్డి... కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డి, కుమార్తెలు నివేదిక, చిత్ర ఓటు వేశారు. నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలింగ్ సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఓట్లు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details