కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కే.ఈ. ప్రతాప్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.
కేఈ ప్రతాప్
By
Published : Apr 3, 2019, 8:36 PM IST
కేఈ ప్రతాప్
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెదేపా అధికారంలోకి రావాలని.....కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ అభ్యర్థి కేఈ ప్రతాప్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తకోట, నక్కలవాగుపల్లి, తిరునాంపల్లి, కొత్త బురుజు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ శివరామిరెడ్డి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థికి అవకాశం కల్పించాలని శివరామిరెడ్డి ఓటర్లను కోరారు.