కర్నూలును స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎంపీ టీజీ వెంకటేష్ హామీ ఇచ్చారు.రాష్ట్ర స్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఇండోర్ స్టేడియంలో ప్రారంభించిన ఆయన,ఈ స్టేడియంలో ఆడిన సింధూ,శ్రీకాంత్,రాజు క్రీడాకారులు అంతర్జాతీయ స్టాయికి ఎదిగారని గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ హాస్టల్స్‌ను నిర్మించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పకీరప్ప పాల్గొని,విద్యార్దుల్లో క్రీడాస్పూర్తి పెరగాలని సూచించారు.
స్పోర్ట్స్ సిటీగా కర్నూలకు అవకాశం: ఎంపీ టీజీ - ప్రారంభించిన టీజీ వెంకటేష్
కర్నూలును స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు.
జూనియర్ బ్యాండ్మింటన్ పోటీలను ప్రారంభించిన టీజీ వెంకటేష్