కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గంగవరం వద్ద పోలీసుల దాడుల్లో 504 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నందవరానికి చెందిన యాంకన్న, వెంకటరాముడు, మద్దిలి గోవిందు, ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్లకు చెందిన మాల మారెప్ప, బోయ వీరేశ్ నాయుడు ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కర్ణాటక మద్యం, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వర రెడ్డి, ఎసై నాగరాజు తెలిపారు.
కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఐదుగురిపై కేసు నమోదు - liquor smuggling latest news update
కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గంగవరం వద్ద పోలీసుల దాడులు నిర్వహించారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 504 మద్యం ప్యాకెట్లతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వర రెడ్డి తెలిపారు.
కర్ణాటక మద్యం అక్రమ రవాణా
ఇవీ చూడండి...