కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యం, గుట్కా ప్యాకెట్లను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్, ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ రామిరెడ్డి తమతమ సిబ్బందితో సంయుక్తంగా పట్టణంలోని కోవెలకుంట్ల రోడ్డులో దాడులు నిర్వహించారు. బైరి భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 144 మద్యం ప్యాకెట్లు, 60 వేల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కర్ణాటక మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - కర్నూలు జిల్లా
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం, గుట్కా ప్యాకెట్లను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ కర్ణాటక మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం