ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హరిత రాయబారులకు అందని వేతనాలు

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి 7 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. నిరసనగా 20 రోజులుగా విధులకు వారు గైర్హాజరు అవుతున్నారు.

By

Published : May 3, 2019, 8:25 PM IST

హరిత రాయబారులకు అందని వేతనాలు

హరిత రాయబారులకు అందని వేతనాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి 7 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. నిరసనగా 20 రోజులుగా విధులకు గైర్హాజరు కావడంతో గ్రామంలో మురుగు, చెత్త నిల్వలు పెరిగిపోయాయి. 7 నెలలుగా జీతాలు రాక కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని హరిత రాయబారులు వాపోతున్నారు. ఈ విషయం పై అధికారులు స్పందించి జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details